Health23rd Aug 03:29 PMSunil Byrisetty1 min read
ఆయుష్ కు రూ.185.75 కోట్ల వార్షిక ప్రణాళిక
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మధ్య సమన్వయం రాష్ట్ర ప్రయోజనాలకు ఏ స్థాయిలో దోహదపడుతుందో మరోసారి స్పష్టమైంది. ఇటీవలే.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రూ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మధ్య సమన్వయం రాష్ట్ర ప్రయోజనాలకు ఏ స్థాయిలో దోహదపడుతుందో మరోసారి స్పష్టమైంది. ఇటీవలే.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రూ. 100 కోట్లతో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగ అండ్ నేచురోపతి 100 పడకల రీసెర్చ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమoలో కూటమి ప్రభుత్వం సమర్పించిన 2026–27 రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక (SAAP)కు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ రూ.185.75 కోట్లకు ఆమోదం తెలిపింది. 2014లో జాతీయ ఆయుష్ మిషన్ ప్రారంభమైన తర్వాత రాష్ట్రానికి లభించిన అత్యధిక వార్షిక కేటాయింపులు ఇవే కావడం విశేషం. గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు 9 ఐటీడీఏల పరిధిలో 19 మొబైల్ మెడికల్ యూనిట్లను సేవల్లోకి తీసుకురావడం ఈ ప్రణాళికలో హైలెట్. నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) కింద నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2014 నుండి 2024 వరకు పదేళ్ల కాలంలో మొత్తం రూ. 120.17 కోట్లు మంజూరు చేయగా, 2024 నుండి 2027 వరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం మూడేళ్ల కాలానికే రూ. 434.64 కోట్ల నిధుల కేటాయింపులకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఇది పాత కేటాయింపులతో పోలిస్తే నాలుగు రెట్లకు పైగా పెరగడం ఆయుష్ వైద్య విధానాల పట్ల పెరుగుతున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.