Sports28th Jul 05:34 PMSunil Byrisetty1 min read

కోనేరు హంపిపై గెలుపు.. విజేతగా దివ్య దేశ్ ముఖ్

ఫిడే మహిళల ప్రపంచకప్‌‌లో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ విజేతగా అవతరించింది. ఫైనల్‌ టై బ్రేక్‌ గేమ్‌లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై విజయం సాధించింది. ఏకంగా ఫిడే టైటిల్‌ గెలుచుకుంది.

కోనేరు హంపిపై గెలుపు.. విజేతగా దివ్య దేశ్ ముఖ్
ఫిడే మహిళల ప్రపంచకప్‌‌లో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ విజేతగా అవతరించింది. ఫైనల్‌ టై బ్రేక్‌ గేమ్‌లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై విజయం సాధించింది. ఏకంగా ఫిడే టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్స్‌లో తొలి రెండు గేమ్స్‌ డ్రాగా ముగియడంతో విజేతపైై ఉత్కంఠ నెలకొంది. దీంతో సోమవారం టై బ్రేకర్‌ నిర్వహించారు. కాగా ఈ ఆటలో హంపిపై దివ్య విజయం సాధించింది. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న నాలుగో భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ అవతరించింది. కేవలం 19 ఏళ్ల వయసులో విజేతగా నిలిచిన దివ్య భారతదేశంలో 88వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. అరుదైన ఈ ఘనత సాధించిన దివ్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Divya Deshmukh
Koneru Humpy
FIDE Women’s World Cup
Chess
Indian Grandmasters
Women in Sports
Indian Chess
Young Achievers
India Sports Achievements
దివ్య దేశ్‌ముఖ్
ఫిడే మహిళల వరల్డ్‌కప్
Scroll for the next article