News19th Sep 03:01 PMSunil Byrisetty1 min read
రూ.2తో జీవోపై విమర్శలు.. స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వంలో రూ.2 మొత్తానికి ఒక జీవో జారీ కావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ అధికారులు ఈ విధంగా పని చేస్తున్నారా అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. దీంతో రూ.2త
ఏపీ ప్రభుత్వంలో రూ.2 మొత్తానికి ఒక జీవో జారీ కావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ అధికారులు ఈ విధంగా పని చేస్తున్నారా అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. దీంతో రూ.2తో జీవో జారీపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సాంకేతిక సమస్య పరిష్కారానికే అనుమతులు ఇచ్చామని పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన రూ.2 జీవోపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వివరణనిచ్చింది. రూ.2 కేటాయింపు వాస్తవ వ్యయం కాదని.. బిల్లుల చెల్లింపులో సాంకేతిక ప్రక్రియ కోసం జారీ చేసిన అనుమతి మాత్రమేనని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. నిపుణుల సూచనల మేరకు అదనపు నిధులుగా రూ.2కు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన CSS పథకం కింద ఉత్తర్వులు జారీ చేసింది.