TTD2nd Jan 01:18 PMSunil Byrisetty1 min read

శ్రీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు భారీ విరాళం

శ్రీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళం అందాయి. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్ర

శ్రీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు భారీ విరాళం
శ్రీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళం అందాయి. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు చొప్పున విరాళం శుక్రవారం అందింది. హైదరాబాద్‌కు చెందిన రైడాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శ్రీ వంగల హర్షవర్ధన్ రూ.10,00,000 శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి నేలబొట్ల శుభ సౌజన్య రూ. 10,00,000లు శ్రీ బాలాజీ ఆరోగ్యం వరప్రసాదిని స్కీం కు డీడీలను అందజేశారు. ఈ మేరకు రూ. 20 లక్షల డిడిలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు శుక్రవారం ఆ సంస్థల ప్రతినిధుల తరుపున తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తితో టీటీడీ ట్రస్టులకు భక్తులు విరాళాలు అందించడం పట్ల ఛైర్మన్ బీ ఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
TTD
Sri SV Pranadana Trust
Sri Balaji Arogya Varaprasadini Scheme
Tirumala Tirupati Devasthanams
Donation
Hyderabad
దాతృత్వం
శ్రీ వెంకటేశ్వర స్వామి
ఆరోగ్య సేవలు
భక్తుల సేవ
Scroll for the next article