News24th Jul 03:51 PMSunil Byrisetty1 min read

భోగాపురం విమానాశ్రయానికి 20 PM ఈ-బస్సులు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్యావరణహిత, అత్యాధునిక ప్రజా రవాణా సేవలను అందించే దిశగా PM ఈ-బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి PM e-Bus Sewa Scheme ద్వారారాష్ట్రానికి రానున

భోగాపురం విమానాశ్రయానికి 20 PM ఈ-బస్సులు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్యావరణహిత, అత్యాధునిక ప్రజా రవాణా సేవలను అందించే దిశగా PM ఈ-బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి PM e-Bus Sewa Scheme ద్వారారాష్ట్రానికి రానున్న 1,050 ఈ బస్సులలో విశాఖకు కేటాయించిన 100 ఈ-బస్సుల్లో 20 బస్సులను భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేకంగా నడపనున్నారు. గాజువాక–ఎన్‌ఏడీ–ఆనందపురం, అలాగే గాజువాక–రైల్వే స్టేషన్–ఆర్టీసీ కాంప్లెక్స్–సిరిపురం మార్గాల్లో ఈ బస్సులు సేవలందించనున్నాయి. 12 మీటర్ల పొడవు, ఎయిర్ సస్పెన్షన్, ఆటోమేటిక్ డోర్లు, 35 సీట్ల సామర్థ్యం, దివ్యాంగుల కోసం వీల్‌చైర్ లిఫ్ట్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో రూపొందిన ఈ బస్సులు విశాఖ నగరం–భోగాపురం విమానాశ్రయం మధ్య వేగవంతమైన, సురక్షితమైన, కాలుష్యరహిత రవాణాను అందిస్తూ రాష్ట్రంలో గ్రీన్ మొబిలిటీకి మరో కీలక మైలురాయిగా నిలవనున్నాయి.
Andhra Pradesh
Visakhapatnam
Bhogapuram International Airport
PM e-Bus Sewa
Electric Buses
Public Transport
ప్రజా రవాణా
గ్రీన్ మొబిలిటీ
విమానాశ్రయ అనుసంధానం
ఏపీఎస్ ఆర్టీసీ
Scroll for the next article