News12th Nov 12:14 PMSunil Byrisetty1 min read

రూ.200 కోట్లతో మైనారిటీల ప్రార్థనా మందిరాలు, షాదీఖానాల పునరుద్ధరణ

మైనారిటీ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్య

రూ.200 కోట్లతో మైనారిటీల ప్రార్థనా మందిరాలు, షాదీఖానాల పునరుద్ధరణ
మైనారిటీ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. టీడీపీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ వర్సిటీ పెట్టాం. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు మైనారిటీ సోదరులు మక్కాకు వెళ్లేందుకు బెంగుళూరు, ముంబయి వెళ్లేవారని, హైదరాబాద్ లో అసెంబ్లీకి ఎదురుగా హజ్ హౌస్ కట్టి అక్కడి నుంచి విమానంలో మక్కా పంపామని గుర్తు చేశారు. మైనారిటీ ఫైన్సాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఏర్పాటు ఘనత టీడీపీదేనన్నారు. ఆనాడు దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యలతో చాలా మంది ముస్లింలు లబ్ధి పొందారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Minority Welfare
TDP
Development
Muslim Community
అభివృద్ధి
ముస్లిం సమాజం
మైనారిటీ శక్తివంతం
ఏపీ ప్రభుత్వం
విజయవాడ
ఉర్దూ విశ్వవిద్యాలయం
Scroll for the next article