News18th Jul 04:29 PMSunil Byrisetty1 min read

డ‌యేరియా కేసుల‌పై అప్ర‌మ‌త్తం

విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని గిరిపురం ప్రాంతంలో తాగునీటి సరఫరాకు సంబంధించి వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని.. ఇక్క‌డి తాగునీరు సుర‌క్షిత‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. వై

డ‌యేరియా కేసుల‌పై అప్ర‌మ‌త్తం
విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని గిరిపురం ప్రాంతంలో తాగునీటి సరఫరాకు సంబంధించి వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని.. ఇక్క‌డి తాగునీరు సుర‌క్షిత‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. వైద్య ఆరోగ్యం, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌.. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షిస్తూ విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయి తనిఖీలు, తాగునీటి నాణ్యతను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. గిరిపురం ప్రాంతంలో తాగునీటి సరఫరా సమయంలో ఇళ్ల వద్దనే రెసిడ్యువల్ క్లోరిన్ పరీక్షల‌ను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 200కు పైగా నీటి నమూనాలను సేకరించి పరీక్షించామ‌ని.. అదేవిధంగా నైట్రైట్, అమ్మోనియా తదితర పారామీటర్లపై కూడా సమగ్రంగా పరిశీలనలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరింత శాస్త్రీయ నిర్ధారణ కోసం నీటి నమూనాలను గుంటూరులోని ఐపీఎం ప్రయోగశాలకు పంపించి రసాయన, బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ నగరపాలక సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న మినరల్ వాటర్ బబుల్స్‌ను గిరిపురం ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Andhra Pradesh
Diarrhoea
Vijayawada
Giripuram
Drinking Water
AP Health Department
NTR District
Collector G Lakshmisha
నీటి నాణ్యత
వైద్య ఆరోగ్య శాఖ
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article