News27th Nov 04:17 PMSunil Byrisetty1 min read
కనెక్టివిటీ రహదారుల నిర్మాణానికి రూ.2వేల కోట్ల మంజూరు!
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి పేర్కొన్నారు. 4వేల కోట్ల ఎనర్జీఎస్ నిధులతో గ్రామాల్లో రహదారులు అభివృద్ధి పరిచామని, గ్రామా
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి పేర్కొన్నారు. 4వేల కోట్ల ఎనర్జీఎస్ నిధులతో గ్రామాల్లో రహదారులు అభివృద్ధి పరిచామని, గ్రామాల కనెక్టివిటీ రహదారుల నిర్మాణానికి 2వేల కోట్ల నిధులు బడ్జెట్లో మంజూరు కానున్నట్లు ఆయన చెప్పారు. కృష్ణా గుడ్లవల్లేరు మండలంలో ఎంపీ వల్లభనేని బాలసౌరి విస్తృతంగా పర్యటించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నేతలతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా మండలంలోని పశుబోట్లవానిపాలెం గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ గర్భకోస వ్యాధుల చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే రాము పాడి రైతులకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, డి వార్మిషన్ మందులు పంపిణీ చేశారు. అనంతరం వెనుతురుమిల్లి గ్రామంలో ఎనర్జీఎస్ విధులు రూ.16.09 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు,రూ. ఐదు లక్షల నిధులతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్, దేశాయిపేట గ్రామంలో రూ.16 లక్షల ఎనర్జీఎస్ నిధులతో నిర్మించిన అంతర్గత రహదారులను ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే రాము, సర్పంచ్ కొప్పినేని శేషవేణి, ప్రారంభించారు.