News26th Sep 11:50 AMSunil Byrisetty1 min read

2047 లక్ష్యం.. కానీ అడుగులు మాత్రం ఈరోజు నుంచే

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని మంత్రి నారా లోకేశ్ గారు ఢిల్లీలో జరిగిన ఫైర్‌సైడ్ చాట్‌లో వివరించారు. ఇంత పెద్ద లక్ష్య

2047 లక్ష్యం.. కానీ అడుగులు మాత్రం ఈరోజు నుంచే
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని మంత్రి నారా లోకేశ్ గారు ఢిల్లీలో జరిగిన ఫైర్‌సైడ్ చాట్‌లో వివరించారు. ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి ఒక్క రంగం సరిపోదు. వ్యవసాయం ఎదగాలి. హార్టికల్చర్ ఎదగాలి. ఆక్వాకల్చర్ విస్తరించాలి. తయారీ రంగం పెరగాలి. ఐటీ, ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాలు అభివృద్ధి చెందాలి. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కొత్త పెట్టుబడులు రావాలి. అందుకే ఢిల్లీలో జరిగిన చర్చల్లో క్వాంటం టెక్నాలజీతో పాటు హార్టికల్చర్, ఆక్వాకల్చర్ వంటి రంగాల ప్రాధాన్యతను కూడా నారా లోకేశ్ గారు ప్రస్తావించారు. అక్టోబర్ 2న హార్టికల్చర్ మిషన్ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది ఒక ముఖ్యమైన ఆలోచనను చూపిస్తుంది. భవిష్యత్తు అంటే కేవలం టెక్నాలజీ కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా. ప్రాసెసింగ్ కూడా. ఎగుమతులు కూడా. అదే సమయంలో ఏఐ, క్వాంటం, డేటా సెంటర్లు వంటి కొత్త ఆర్థిక రంగాల్లో కూడా ఏపీ అవకాశాలను నిర్మించుకోవాలి.
Scroll for the next article