News8th Aug 10:45 AMSunil Byrisetty1 min read

అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల కోసం రూ.206 కోట్లు

రాజధాని పరిధిలో నిర్మిస్తున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లో మార్పులు, కన్సల్టెంట్ల నియమాకం కోసం ఫాస్టర్స్ పార్టనర్సు అదనంగా రూ.38.18 కోట్లు చెల్లించేందుకు పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తె

అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల కోసం రూ.206  కోట్లు
రాజధాని పరిధిలో నిర్మిస్తున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లో మార్పులు, కన్సల్టెంట్ల నియమాకం కోసం ఫాస్టర్స్ పార్టనర్సు అదనంగా రూ.38.18 కోట్లు చెల్లించేందుకు పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. సిఆర్డిఏ అథారిటీ 64వ సమావేశంలో 682వ తీర్మానంపై తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో హైకోర్టు బిల్డింగ్ బిల్ట్ అప్ విస్తీర్ణం పెరగడంవల్ల కన్సల్టెన్సీ పరిధి పెరిగిందని తెలిపారు. అలాగే అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ల నియామకం కోసం సవరించిన ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారం కాంట్రాక్ట్ మారకపు రేటు వ్యత్యాసం, జీఎస్టీ కోసం అదనపు బడ్జెట్ కేటాయింపు చేసినట్లు తెలిపారు. ఫాస్టర్ పార్ట్నర్స్ లిమిటెడ్ కంపెనీకి చెల్లించాల్సిన కాంట్రాక్టు బాధ్యతపై మారకపు రేటు ₹109 నుండి ₹128.215కి పెరిగిందని అందువల్ల రూ.3.67 కోట్ల అదనపు బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా విదేశీ మారకద్రవ్య వ్యత్యాసం కలిపి జీఎస్టీ కాకుండా అదనంగా రూ.38.18 కోట్ల భారం పడుతుందని వివరించారు.
Andhra Pradesh
Assembly Building
High Court Building
Amaravati
CRDA
Foster + Partners
Urban Development Department
పట్టణాభివృద్ధి శాఖ
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్
కన్సల్టెంట్లు
Scroll for the next article