News20th Jul 04:58 PMSunil Byrisetty1 min read
సీమ రూపురేఖలు మార్చేలా రూ. 20,884 కోట్ల భారీ వ్యూహం
రాయలసీమ జిల్లాల్లో 9.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడాన్ని లక్ష్యంగా చేసుకుని, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాలువల బలోపేతం, ఎత్తిపోతల పథకాల ఆధునీకీకరణతో రాయలసీమ చరిత్రలోనే ఒక
రాయలసీమ జిల్లాల్లో 9.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడాన్ని లక్ష్యంగా చేసుకుని, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాలువల బలోపేతం, ఎత్తిపోతల పథకాల ఆధునీకీకరణతో రాయలసీమ చరిత్రలోనే ఒక అతిపెద్ద సాగునీటి యజ్ఞానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాయలసీమ అనగానే మనకు గుర్తొచ్చేది కరవు, సాగునీటి ఎద్దడి. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నెన్నో ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. కానీ, సీమలోని మెజారిటీ ప్రాంతాలు ఇప్పటికీ ఆకాశం వైపు చూడాల్సిందే. పడిపోతున్న భూగర్భ జలాలు, పాతబడిపోయిన కాలువలు ఇక్కడి రైతాంగాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కాగితాల మీద వేల ఎకరాల ఆయకట్టు సృష్టించినట్లు లెక్కలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో రైతు పొలానికి నీరు చేరడం అనేదానికి మాత్రం ఎప్పుడూ మోక్షం లభించలేదు. ప్రస్తుతం రాయలసీమ అంతటా రూ. 20,884 కోట్ల విలువైన సాగునీటి పనులు క్షేత్రస్థాయిలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే అదనంగా 52 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల 4.37 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీరు స్థిరపడటమే కాకుండా, మొత్తంగా దాదాపు 9.80 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలుగుతుంది.