News2nd Nov 11:17 AMSunil Byrisetty1 min read

ఏపీలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు..

ఏపీ పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో పలు కీలక విభాగాలకు, జిల్లాలకు కొత్త

ఏపీలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు..
ఏపీ పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో పలు కీలక విభాగాలకు, జిల్లాలకు కొత్త అధికారులను నియమించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. విశాఖపట్నం సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్‌ పటేల్‌ నియమితులయ్యారు. సైబర్‌ క్రైమ్‌, సీఐడీ ఎస్పీగా అధిరాజ్‌సింగ్‌ రాణా, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా కె. శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా ఈ.జి అశోక్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు మరికొందరికి కూడా కీలక పోస్టింగ్‌లు ఇచ్చారు. విజయవాడ సిటీ ట్రాఫిక్‌ డిప్యూటీ కమిషనర్‌గా షేక్‌ షరీన్‌ బేగం, మహిళల భద్రత విభాగం సీఐడీ ఎస్పీగా వి.రత్న, విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా రవిశంకర్‌ రెడ్డి, సీఐడీ ఎస్పీగా ఆర్‌.గంగాధర్‌ రావు, ఆర్గనైజేషన్స్‌ అసిస్టెంట్‌ ఐజీగా టి.పనసారెడ్డి, ప్లానింగ్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ అసిస్టెంట్‌ ఐజీగా పి.వెంకటరత్నం నియమితులయ్యారు.
Andhra Pradesh IPS Transfers
Police Department
Transfer Orders
Visakhapatnam
Vijayawada
CID
ACB
R. Gangadhar Rao
V. Ratna
మహిళల భద్రత
ఏపీఎస్పీ
రవిశంకర్ రెడ్డి
Scroll for the next article