News16th Oct 10:45 AMSunil Byrisetty1 min read

ఏపీకి రూ.21,800 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్‌!

ఏపీకి మరో పెద్ద శుభవార్త లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్‌–3 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజ

ఏపీకి రూ.21,800 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్‌!
ఏపీకి మరో పెద్ద శుభవార్త లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్‌–3 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద రూ.21,800 కోట్ల భారీ విద్యుత్ లైన్ల వ్యవస్థ ఏర్పాటు చేయబడనుంది. అనంతపురం నుంచి నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు ఈ లైన్లు విస్తరించనున్నాయి. దీని ద్వారా రాయలసీమలో ఉత్పత్తి అయ్యే సోలార్, విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించవచ్చు. ఇది రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్–3’ కింద కేంద్రానికి ప్రతిపాదించింది. మొత్తం రూ.28,000 కోట్ల అంచనాతో ప్రాజెక్టు సమర్పించగా, సీఈఆర్‌సీ పరిశీలించి రూ.21,800 కోట్లకే ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం 30 శాతం గ్రాంట్‌ (సుమారు రూ.6,540 కోట్లు) కింద అందించనుంది. మిగిలిన వ్యయం అయిన రూ.15 వేల కోట్లను ఏపీ ట్రాన్స్‌కో భరించనుంది. ఈ పనులు 2026–27లో ప్రారంభమై రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధమవుతోంది.
Andhra Pradesh
Green Energy
Renewable Energy
Electricity Projects
Solar Power
Wind Energy
Modi Visit
Energy Infrastructure
భారత విద్యుత్ రంగం
సీఈఆర్సీ
మౌలిక వసతుల అభివృద్ధి
క్లీన్ ఎనర్జీ
Scroll for the next article