National7th Dec 09:34 AMSunil Byrisetty1 min read

గోవాలో నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం.. 23మంది ఆహుతి!

గోవాలోని ఓ నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని 23 మంది మరణించారు. అర్పోరా ప్రాంతంలోని బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. 23

గోవాలో నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం.. 23మంది ఆహుతి!
గోవాలోని ఓ నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని 23 మంది మరణించారు. అర్పోరా ప్రాంతంలోని బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. 23 మంది మరణించగా అందులో నలుగురు పర్యాటకులు, మిగతా అందరూ క్లబ్ సిబ్బందిగా తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. 'ఈ ప్రమాదంపై పూర్తి దర్యాప్తునకు ఆదేశిస్తాం. క్లబ్లో సేఫ్టీ రూల్స్ పాటించలేదని ప్రాథమికంగా సమాచారం అందింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని సీఎం తెలిపారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సానుభూతి వ్యక్తం చేశారు.
India news
Goa fire accident
Nightclub fire
Arpora incident
Birch nightclub
Cylinder blast
Pramod Sawant
Safety violations
Tourists
Tragedy
23 మంది మృతి
గోవా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం
Scroll for the next article