Education Type3rd Mar 11:40 AMSunil Byrisetty1 min read
జడ్జిగా ఎదిగిన సామాన్య గిరిజన మహిళ!
మనలో సాధించాలనే కసి.. పట్టుదల ఉంటే.. మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేది ప్రదానం కాదు.. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాము అనేది ముఖ్యం అని నిరూపించింది.. తమిళనాడులోని తిరుపట్టూరు జిల్
మనలో సాధించాలనే కసి.. పట్టుదల ఉంటే.. మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేది ప్రదానం కాదు.. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాము అనేది ముఖ్యం అని నిరూపించింది.. తమిళనాడులోని తిరుపట్టూరు జిల్లా ఎలగిరి హిల్స్‌కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి.శ్రీపతి. చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వతశ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్, తల్లి మల్లిక. కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు... శ్రీపతి కి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. బంధువుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే అంబులెన్స్ డ్రైవర్ తో వివాహం జరిపించారు. పెళ్ళైనా శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు. "Dr. అంబేడ్కర్ లా విశ్వవిద్యాలయం" లో పీజీ చేసింది. వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు అప్లై చేసింది. అయితే పరీక్షకు అప్లై చేసేనాటికే తాను గర్భవతిని అని తెలిసింది. సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగా ఉందని ఆందోళన చెందింది. పరీక్ష రాయాల్సిన డేట్ వచ్చేసింది. డెలివరీకి వెళ్ళేముందు కూడా పుస్తకాలు చదవడం వదలలేదు శ్రీపతి. నవంబర్ 27 న శ్రీపతి చక్కటి పాపకు జన్మనిచ్చింది. నవంబర్ 29 న పరీక్ష. రెండ్రోజుల బాలింత. పరీక్ష రాయల్సిన చోటు.. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో... అయినాసరే పరీక్ష రాస్తానని పట్టుబట్టింది. డాక్టర్లు వారించినా వినలేదు. తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష వ్రాసింది. సెలెక్ట్ అయ్యింది. TNPSCలో ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యింది. ఫిబ్రవరి 15న జూనియర్ సివిల్ జడ్జ్ గా, "మొట్టమొదటి గిరిజన మహిళగా" అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది.