Health18th Nov 04:52 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వాసుపత్రుల్లో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు

అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్రంలోని ముఖమైన 24 ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'క్రిటికల్ కేర్ బ్లాకులు' (CCBs)రాబోతున్నాయి. వచ్చే నెలాఖరు నాటికి 13, 2026 ఆగస్టు నాటికి మరో 11 సీసీబీల

ప్రభుత్వాసుపత్రుల్లో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు
అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్రంలోని ముఖమైన 24 ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'క్రిటికల్ కేర్ బ్లాకులు' (CCBs)రాబోతున్నాయి. వచ్చే నెలాఖరు నాటికి 13, 2026 ఆగస్టు నాటికి మరో 11 సీసీబీలను వినియోగంలోనికి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. వీటి ద్వారా అదనంగా 1,275 పడకలు అందుబాటులోనికి వస్తాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) కింద రూ.600 కోట్ల వ్యయంతో చేపట్టిన వీటి నిర్మాణాలను దశల వారీగా వచ్చే ఏడాది ఆగస్టులోగా పూర్తిచేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 621 సీసీబీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గుంటూరు మినహా 16 బోధనాసుపత్రులు, తెనాలి, అనకాపల్లి, హిందూపురం జిల్లా అసుపత్రులు (3), నరసరావుపేట, పాలకొండ, భీమవరం, రాయచోటి, చీరాల ఏరియా (5) ఏరియా ఆసుపత్రుల్లో వీటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నెల్లూరు, ఒంగోలు బోధనాసుపత్రుల్లోని సీసీబీల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరు నాటికి కడప, కర్నూలు, తిరుపతి, హిందూపురం, అనంతపురం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, విశాఖ, శ్రీకాకుళం, విజయవాడ, విజయనగరం, 2026 మార్చి నాటికి తెనాలి జిల్లా ఆసుపత్రి, ఆగస్టు నాటికి చీరాల, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, పాలకొండ, నంధ్యాల, భీమవరం, నరసరావుపేట, రాయచోటి, కాకినాడ ఆసుపత్రుల్లో నిర్మాణాలు పూర్తవుతాయి.
Andhra Pradesh
Government Hospitals
Critical Care Blocks
CCB
PM ABHIM
Healthcare Infrastructure
Hospital Expansion
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ఆసుపత్రుల విస్తరణ
వైద్య సౌకర్యాలు
ప్రజా ఆరోగ్యం
రోగి సంరక్షణ
ఆరోగ్య అభివృద్ధి
Scroll for the next article