News30th Sep 05:20 PMSunil Byrisetty1 min read

25 మంది బైక్ రైడర్లతో తిరుపతి - వారణాసి బైక్ యాత్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి

25 మంది బైక్ రైడర్లతో తిరుపతి - వారణాసి బైక్ యాత్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, యువ నాయకుడు నారా లోకేష్ సూచనతో TNSF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప యాత్రను పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. "తిరుపతి నుంచి వారణాసి వరకు 25 మంది బైక్ రైడర్లతో ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీవారి ఆశీస్సులతో అలిపిరి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు ఎనిమిది రోజుల పాటు కొనసాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుంది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం యాత్రకు స్వాగతం పలుకనున్నారు. ఈ యాత్రలో TNSF రాష్ట్ర నాయకులు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న బైక్ రైడర్లందరికీ శుభాకాంక్షలు" తెలిపారు.
Scroll for the next article