News18th Jan 04:01 PMSunil Byrisetty1 min read

ఉద్యోగ మేళాలో 25 మంది ఎంపిక

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే జాబ్ మేళాలో భాగంగా 18వ తేదీ ఆదివారం నిర్వహించిన 33వ జాబ్ మేళాలో ఉపాధి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్

ఉద్యోగ మేళాలో 25 మంది ఎంపిక
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే జాబ్ మేళాలో భాగంగా 18వ తేదీ ఆదివారం నిర్వహించిన 33వ జాబ్ మేళాలో ఉపాధి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాలో 25 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. రేడియంట్ టెక్నాలజీస్ కు 9 మంది, జెన్ టెక్నాలజీస్ కంపెనీ కు 13 మంది, జెన్పాక్ట్ కు ప్రాథమికంగా 3 ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన వాళ్ళందరూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత సత్యం, అలాగే ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ కి అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన దిశగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని వివరించారు.
Ap news
Job Mela
Employment Opportunities
Labour Department
Minister Vasamsetti Subhash
Satyam Vasamsetti Foundation
Upaadhi Project
Youth Employment
Radiant Technologies
Gen Technologies
Genpact
Skill Development
Scroll for the next article