News28th Jan 04:58 PMSunil Byrisetty1 min read
పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి!
“గత దశాబ్ద కాలం భారత చరిత్రలో సువర్ణాధ్యాయం. సంస్కరణలే ఊపిరిగా, సంక్షేమమే ధ్యేయంగా సాగిన ప్రస్థానంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం అనే కోరల నుంచి విముక్తి చేయగలిగాం. వికసిత భారత్ క
“గత దశాబ్ద కాలం భారత చరిత్రలో సువర్ణాధ్యాయం. సంస్కరణలే ఊపిరిగా, సంక్షేమమే ధ్యేయంగా సాగిన ప్రస్థానంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం అనే కోరల నుంచి విముక్తి చేయగలిగాం. వికసిత భారత్ కల సాకారమయ్యే దిశగా దేశం వడివడిగా అడుగులు వేస్తోంది.” అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. బుధవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం, దేశ ప్రగతిని ఆవిష్కరిస్తూనే భవిష్యత్ లక్ష్యాలకు దిశానిర్దేశం చేసింది. పేదలు, మహిళలు, యువత, రైతుల అభ్యున్నతే కేంద్రంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, వందేభారత్ నుంచి అంతరిక్ష కేంద్రం వరకు భారత్ సాధిస్తున్న విజయాలను ఆమె సగర్వంగా వివరించారు. 2030లో కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా, వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని, బిర్సాముండా, సర్దార్ పటేల్, భూపేన్ హజారికా వంటి మహనీయులను స్మరించుకుంటూ.. సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతి కలగలిసిన ‘వికసిత భారత్’ నిర్మాణానికి అందరూ పునరంకితం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.