Education3rd Sep 05:12 PMSunil Byrisetty1 min read
ప్రైవేటులో నాలుగో వంతు.. అధ్యయనానికి కమిటీ!
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాల సవరణకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. విద్యా హక్కు చట్టం 2009
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాల సవరణకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం.. ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. అయితే వాటికి సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలను సవరించాల్సి ఉంది. అందుకోసం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఛైర్‌పర్సన్‌గా 16 మంది సభ్యులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.