News10th Sep 09:01 AMSunil Byrisetty1 min read
ప్రతి కుటుంబానికి బీమా.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటల్ బీమా-ఎన్టీఆర్ వైద్య సేవ సమ
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటల్ బీమా-ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయంతో హైబ్రిడ్ మోడ్ లో కొత్త బీమా సౌకర్యం వర్తించనుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకు దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక, యూనివర్సల్ హెల్త్ పాలసీ కోసం ఇన్సూరెన్స్ సంస్థలను టెండర్లకు పిలిచింది. రాష్ట్రంలోని BPL కుటుంబాలకు దీన్ని వర్తింపుజేయనున్నారు. ఏడాదికి 5 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్నవారికి హెల్త్ స్కీమ్ వర్తిస్తుంది. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ ఎం ప్యానల్ హాస్పిటల్స్ కు వర్తింపజేస్తారు. 3,257 రకాల వ్యాధులకు మెడికల్, సర్జికల్ ప్రొసీజర్లకు వర్తింపజేయనున్నారు.