News17th Jan 05:04 PMSunil Byrisetty1 min read
దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీలోనే!
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరిగెత్తిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడలో ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం చంద్ర
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరిగెత్తిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడలో ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే ప్రకారం దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ కు 25 శాతం వచ్చాయని వివరించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్ ద్వారా 13 లక్షల 25 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నామని, 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రతి నెలా ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 14 మీటింగులు పెట్టి, 8 లక్షల 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. దీని వల్ల 8 లక్షల 40 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రిన్యూర్ అనే పాలసీని తెచ్చామని, 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు పెట్టి, 5 జోన్లలో 5 స్పోక్ మోడళ్లు తెస్తామన్నారు.