News29th Aug 05:21 PMSunil Byrisetty1 min read
2,500 ఎకరాల్లో క్రీడా నగరం
రాజధాని అమరావతిలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘క్రీడా నగరం’తో పాటు 'క్రీడా విశ్వవిద్యాలయం'ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. క్రీడలను క్షేత్రస్థాయిలో ప్రోత్స
రాజధాని అమరావతిలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘క్రీడా నగరం’తో పాటు 'క్రీడా విశ్వవిద్యాలయం'ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. క్రీడలను క్షేత్రస్థాయిలో ప్రోత్సహించడానికి పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్ వంటి ప్రముఖ క్రీడాకారుల అకాడమీలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు 6 ప్రత్యేక అకాడమీలను ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ క్రీడా పోటీలు జరిగినా ఏపీ నుంచి కనీసం ఒక్కరైనా ప్రాతినిధ్యం వహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖలో ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో 5 లక్షల మంది పాల్గొని రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ‘హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్’గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు.