News10th Aug 05:59 PMSunil Byrisetty1 min read

మిగిలిన వారికి వారంలోగా ‘నేతన్న సేవలో’

అర్హులైన నేతన్నలందరికీ నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సహాయమందిస్తామని మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిలో అర్హులను గుర్తించి, వారం రోజు

మిగిలిన వారికి వారంలోగా  ‘నేతన్న సేవలో’
అర్హులైన నేతన్నలందరికీ నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సహాయమందిస్తామని మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిలో అర్హులను గుర్తించి, వారం రోజుల్లోగా రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్లు నిండిన 85,678 మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం కింద 200 యూనిట్లు, 500 యూనిట్లు అందజేస్తున్నామన్నారు. చేనేత కుటుంబాలకు మరింత ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల నేతన్నల సేవలో పథకాన్నికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా 71,536 మందికి రూ.25 వేల చొప్పున్న ఆర్థిక సాయం అందించామన్నారు. అర్హులు ఇంకా ఉన్నారన్న ఉద్దేశంతో దరఖాస్తులు కూడా స్వీకరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,678 మంది నేతన్నల సేవలో పథకానికి దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వారిలో అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు.
Andhra Pradesh government
Nethanna Sevalo
Handloom Weavers
Weaver Welfare
Financial Aid
Handloom Sector
Weaver Pension
ఉచిత విద్యుత్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్
మంత్రి సవిత
చంద్రబాబు నాయుడు
Scroll for the next article