News16th Dec 12:41 PMSunil Byrisetty1 min read
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలను కేంద్రం సవరించింది. 26 జిల్లాల ప్రకారం ఏపీని ఆరు జోన్లుగా ప్రకటించింది. వాటిని రెండు మల్టీ జోన్లుగా విభజిస్తూ గెజిట్
పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలను కేంద్రం సవరించింది. 26 జిల్లాల ప్రకారం ఏపీని ఆరు జోన్లుగా ప్రకటించింది. వాటిని రెండు మల్టీ జోన్లుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మల్టీ జోన్-1
జోన్-1: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి
జోన్-2: అల్లూరి, తూ.గో, కాకినాడ, కోనసీమ
జోన్-3: ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్
మల్టీ జోన్-2
జోన్-4: పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల
జోన్-5: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్-6: అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి