Health17th Sep 05:17 PMSunil Byrisetty1 min read
సేవే లక్ష్యంగా.. 2,600 వైద్య శిబిరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్ట్రంలో 2,600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్ట్రంలో 2,600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా, చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. క్రమంగా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, చికిత్స అవసరమైన వారిని గుర్తించి నిరంతర వైద్య సంరక్షణ అందేలా చూడటానికి ఈ శిబిరాలు ఉపయోగపడతాయని మంత్రి వివరించారు. మోదీ జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజలకు సేవ చేయడం ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రంలో తొలి వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ప్రారంభించారు.