News1st Jan 10:42 AMSunil Byrisetty1 min read

మహారాష్ట్ర డీజీపీగా 26/11 హీరో సదానంద్

మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్(డీజీపీ)గా 26/11 ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన సదానంద్ దాతే నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన 59 ఏళ్ల సదానంద్ జ

మహారాష్ట్ర డీజీపీగా 26/11 హీరో సదానంద్
మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్(డీజీపీ)గా 26/11 ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన సదానంద్ దాతే నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన 59 ఏళ్ల సదానంద్ జనవరి 3న బాధ్యతలు స్వీకరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అధిపతిగా ఉన్న ఆయన ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీల్లో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. ఆర్థిక నేరాలపై పరిశోధనలకు గాను ఆయన పుణే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దాతే 26/11 ముంబై ఉగ్రదాడులను ఎదుర్కొన్న హీరోలలో ఒకరిగా నిలిచారు. 2008 నవంబర్ 26న ఉగ్రదాడుల సమయంలో ఆయన ముంబై సెంట్రల్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ గా కామా ఆసుపత్రిపై దాడి చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు.
Maharashtra
DGP
Sadanand Date
26/11 Mumbai Attacks
IPS Officer
NIA
Maharashtra Police
ఎన్ఐఏ
మహారాష్ట్ర పోలీసులు
భద్రత
స్థానిక సంస్థల ఎన్నికలు
Scroll for the next article