Politics19th Nov 03:59 PMSunil Byrisetty1 min read

రాహుల్ కు 272 మంది ప్రముఖుల లేఖ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు కౌంటర్ పడింది. భారత ప్రజాస్వామ్యం, దాని మూల స్తంభాలపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖులు లేఖ రాశారు. ఓట్ల చోరీ

రాహుల్ కు 272 మంది ప్రముఖుల లేఖ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు కౌంటర్ పడింది. భారత ప్రజాస్వామ్యం, దాని మూల స్తంభాలపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖులు లేఖ రాశారు. ఓట్ల చోరీ జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన విధానాలను విమర్శిస్తూ ఈ లేఖ వెలువడింది. ఈ లేఖపై 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 మంది మాజీ అధికారులు, 133 మంది మాజీ సైనికాధికారులు, 14 మంది మాజీ రాయబారులు సంతకాలు చేశారు. ప్రజాస్వామ్యం, దాని పునాదులపై దాడి జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారని గుర్తు చేశారు.
Indian Democracy
Rahul Gandhi
Congress
Letter by 272 Eminent Persons
Election Commission
Vote Tampering Allegations
మహారాష్ట్ర ఎన్నికలు
హర్యానా ఎన్నికలు
మాజీ న్యాయమూర్తులు
మాజీ అధికారులు
భారత రాజకీయాలు
Scroll for the next article