News22nd Oct 07:33 PMSunil Byrisetty1 min read
27.54 లక్షల మంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు
రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) కింద గడచిన మూడు నెలల్లో 27.54 లక్షల మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరోగ్య సమస్యలు గుర్తించిన 27
రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) కింద గడచిన మూడు నెలల్లో 27.54 లక్షల మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరోగ్య సమస్యలు గుర్తించిన 27,039 మందికి తదుపరి చికిత్స కొనసాగుతోంది. అలాగే 541 మందికి పలు రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆర్‌బీయస్‌కే కింద రాష్ట్రంలోని రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 53,66,466 మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం గత జులైలో ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన 27.54 లక్ష(51.32%)ల్లో 9,32,352 మందికి మరోమారు వైద్యాధికారులు నిర్ధారణ పరీక్షలు చేశారు. చివరిగా 27,039 మందిలో చికిత్సకు తగ్గ లోపాలున్నట్లు గుర్తించారు. వీరికి పెద్దాసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అమలు తీరుపై ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు, ఇతర