Jobs29th Aug 03:04 PMSunil Byrisetty1 min read
గ్రామ, వార్డు సచివాలయాలకు పోస్టులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ/వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేం
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ/వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేం దుకు శ్రీకారం చుట్టిన గ్రామ/వార్డు సచివాలయాల శాఖ.. తాజాగా మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. డిప్యుటేషన్ / ఔట్సోర్సింగ్ ద్వారా 2,778 పోస్టులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా మండలాలు/పట్టణ స్థానిక సంస్థల నుంచి 1,785 మందిని డిప్యుటేషన్పై వినియోగించుకోనున్నారు. 993 కొత్త ఏఎన్ఎం/ వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు. తద్వారా సేవలను వేగంగా, పారదర్శకంగా అందించనున్నారు.