News18th Sep 03:44 PMSunil Byrisetty1 min read
విశాఖలో 28,445 కుటుంబాలకు ఇంటిపట్టాల పంపిణీ
విశాఖలో 28,445 కుటుంబాలకు ఇంటిపట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది.
విశాఖలో 28,445 కుటుంబాలకు ఇంటిపట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!’ అంటూ పేర్కొన్నారు.
‘ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు...ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నామ’న్నారు.
‘ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు... 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది.
భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది.
బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది.
ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది.’ అని ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు.