Education18th Aug 04:53 PMSunil Byrisetty1 min read

ఫిన్‌లాండ్‌కు ఉత్తమ ఉపాధ్యాయులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన 29 మంది ఉపాధ్యాయులకు ఫిన్‌లాండ్‌లో శిక్షణనిస్తున్నా

ఫిన్‌లాండ్‌కు ఉత్తమ ఉపాధ్యాయులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన 29 మంది ఉపాధ్యాయులకు ఫిన్‌లాండ్‌లో శిక్షణనిస్తున్నారు. ప్రసిద్ధ 'టుర్కు యూనివర్సిటీ'లో అంతర్జాతీయ వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఫిన్‌లాండ్ విద్యా విధానంలోని అత్యుత్తమ బోధన పద్ధతులు, పిల్లల కేంద్రీకృత విద్య, ఆటల ద్వారా విద్య, ఆనందదాయక బోధనలపై ఉపాధ్యాయులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ శిక్షణా కార్యక్రమం మొత్తం మూడు విడతల్లో నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో విజయవాడలో ఫిన్‌లాండ్ విద్యా నిపుణులచే 4 రోజుల పాటు ప్రాథమిక అవగాహన సదస్సు జరిగింది. రెండో విడతలో భాగంగా ఆగస్టు 17 నుంచి 26 వరకు ఫిన్‌లాండ్‌లోని టుర్కు, రౌమా నగరాల్లో 8 రోజుల పాటు ప్రత్యక్ష శిక్షణ జరుగుతోంది. మూడో విడతలో శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో అమలు చేసే అభివృద్ధి ప్రాజెక్టులపై ఫిన్‌లాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మూడు ఆన్‌లైన్ సెషన్ల ద్వారా మార్గదర్శకత్వం, అభిప్రాయాలు, మద్దతును అందిస్తారు.
Andhra Pradesh
Teachers Training
Finland
Turku University
Best Teachers
Education Reforms
Teacher Development
పిల్లల కేంద్రీకృత విద్య
ఆటల ద్వారా విద్య
ఆనందదాయక బోధన
విజయవాడ
టుర్కు
రౌమా
విద్యాశాఖ
Scroll for the next article