News3rd Jun 12:04 PMSunil Byrisetty1 min read
మంగళగిరిలో త్వరలో రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీ!
మంగళగిరి నియోజకవకర్గంలో త్వరితగతిన రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా
మంగళగిరి నియోజకవకర్గంలో త్వరితగతిన రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి మొదటి విడతగా సుమారు 3వేల మందికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. రెండో విడతలో 2,500 ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే, కాలువ, అటవీ, దేవాదాయ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను తర్వితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మంగళగిరిలో యూ1, ఐ2 జోన్లు, భవన నిర్మాణ అనుమతులు సీఆర్డీయే నుంచి ఎంటీఎంసీకి బదిలీ చేసే అంశంపైనా సమావేశంలో చర్చించారు. మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, స్టోమ్ వాటర్ డ్రైన్స్, తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ ప్రాజెక్టులపైనా సమావేశంలో చర్చించారు. ఆగష్టు నాటికి ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ లను పూర్తిచేసి అన్ని పనులు ఒకేసారి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు.