News2nd Oct 01:59 PMSunil Byrisetty1 min read
దీపావళికి 3 లక్షల గృహప్రవేశాలు
విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. “జీవితాంతం పేదల పక్షాన ఉంటాను. ఊపిరి పోయే వరకు, చివరి రక్
విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. “జీవితాంతం పేదల పక్షాన ఉంటాను. ఊపిరి పోయే వరకు, చివరి రక్తపు బొట్టు వరకు పేదలకు సేవ చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు. పేదల కష్టాలు తెలుసుకోవడానికే ప్రతి నెలా ఒక గ్రామానికి వెళ్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, ఈ దీపావళికే 3 లక్షల గృహప్రవేశాలు నిర్వహిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గృహ నిర్మాణాల పనులు వేగంగా జరిగేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. పేదలకు ఇల్లు, భూమి ఇవ్వడం తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.