National5th Oct 11:59 AMSunil Byrisetty1 min read

సిలిండర్లపై సబ్సిడీ.. కేంద్రం తీపికబురు

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లపై రూ.300 సబ్సిడీని అందిస్తోంది. 2016 మేలో ప్రధాని మోదీ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 10.57 కోట్ల మంది మహిళ

సిలిండర్లపై సబ్సిడీ.. కేంద్రం తీపికబురు
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లపై రూ.300 సబ్సిడీని అందిస్తోంది. 2016 మేలో ప్రధాని మోదీ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 10.57 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించారు. సాధారణ ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్, సిలిండర్ కోసం ఇతర ఛార్జీలు వసూలు చేస్తారు. కేంద్రం ఉజ్వల్ యోజన పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్, సిలిండర్లు అందిస్తోంది. 2025-26లో 42 కోట్ల గ్యాస్ రీఫిల్స్‌కు సబ్సిడీ అందించారు. తాజాగా ఈ స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో కూడా రూ.300 సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఉజ్వల్ యోజన పథకం ద్వారా మరో 25 లక్షల కనెక్షన్లను అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Scroll for the next article