News14th May 11:25 AMSunil Byrisetty1 min read
నెల్లూరు రూరల్‌లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో 339 అభివృద్ధి పనుల జాతర జరగనుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339 అభివృద్ధి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో 339 అభివృద్ధి పనుల జాతర జరగనుంది.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ మహోత్సవం చేయనున్నారు.
ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు.
ఆనాడు 60 రోజుల ముందు ప్రజల చేత శంకుస్థాపనలు నేడు ప్రజల సాక్షిగా పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధవీరులకు అంకితం అని ప్రకటించారు.