News30th Sep 05:52 PMSunil Byrisetty1 min read

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛతా హీ సేవ–2026’ కార్యక్రమాల్లో భాగంగా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం విశ

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛతా హీ సేవ–2026’ కార్యక్రమాల్లో భాగంగా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం విశేష స్పందనతో సాగింది. నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 170 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 35,147 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పొడి వ్యర్థాలను తీసుకువచ్చి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సేకరణ కేంద్రాలకు అందించారు. సుమారు 50 వేల కిలోల పొడి వ్యర్థాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. నిడమర్రులోని లీప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్–సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ డా. ఉల్లాజీ ఎలియాజర్ హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణ, విద్యార్థుల భాగస్వామ్యం, వ్యర్థాల సేకరణ తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ధృవీకరణ పత్రాన్ని మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ కు అందజేశారు.
Scroll for the next article