Telangana22nd Nov 05:55 PMSunil Byrisetty1 min read
37 మంది మావోయిస్టులు లొంగుబాటు
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా కీలక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా అధికారుల ముందుకు వచ్చాడు. ఏవో
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా కీలక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా అధికారుల ముందుకు వచ్చాడు. ఏవోబీ (ఆంధ్ర-ఒడిశా సరిహద్దు) ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన ఆజాద్, గత కొంతకాలంగా భద్రతా దళాల నిఘాలోనే ఉన్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు.
ఆజాద్ పాటు లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తిని కూడా అప్పగించారు. పోలీసులు ఈ సందర్భంగా 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్, వాటికి సంబంధించిన బుల్లెట్లు, క్యాట్రెడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతియుత జీవనానికి తిరిగి రావాలనే ఉద్దేశంతో లొంగిపోయిన వారికి ప్రభుత్వం రూపొందించిన పునరావాస పథకాల ప్రకారం సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.