News21st Nov 11:57 AMSunil Byrisetty1 min read

మయన్మార్ చెర నుంచి స్వదేశానికి..

మయన్మార్ నుంచి రక్షించబడిన 370 మందిని స్వదేశానికి తిరిగి వచ్చిన మూడు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. వారిలో 55 మంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలకు చెంది

మయన్మార్ చెర నుంచి స్వదేశానికి..
మయన్మార్ నుంచి రక్షించబడిన 370 మందిని స్వదేశానికి తిరిగి వచ్చిన మూడు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. వారిలో 55 మంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలకు చెందినవారు ఉండగా వీరికి తోడుగా 8 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఏపీ భవన్ బృందం వారిని భారత ప్రభుత్వ అధికారుల నుంచి స్వీకరించి సురక్షితంగా ఏపీ భవన్‌కు తీసుకువచ్చింది. వారందరికీ తాత్కాలిక వసతి, ఆహార ఏర్పాట్లు చేయబడ్డాయి. మయన్మార్‌లో వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నందున వారి వద్ద డబ్బు లేకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందున వారి తదుపరి ప్రయాణ సమయంలో ఇతర ఖర్చులకు సహాయంగా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 1,000 సహాయం అందించింది. అందరూ వారి వారి గమ్యస్థానాలకు చేరేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
India
Myanmar Rescue
Andhra Pradesh
Repatriation
Delhi Arrival
AP Bhavan
Government Assistance
Migrant Rescue
విజయవాడ
విశాఖపట్నం
ప్రభుత్వ సహాయం
భారతీయుల తిరుగు ప్రయాణం
Scroll for the next article