Education24th Jul 04:31 PMSunil Byrisetty1 min read

తల్లికి వందనంపై ప్రభుత్వం క్లారిటీ!

తల్లికి వందనం సొమ్ము జమపై సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారని తెలిపారు. తల్లికి వందనం పథ

తల్లికి వందనంపై ప్రభుత్వం క్లారిటీ!
తల్లికి వందనం సొమ్ము జమపై సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారని తెలిపారు. తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించి కొంత వాటాను కేంద్రం భరిస్తుందని స్పష్టం చేశారు. ఆ సొమ్ము బ్యాంక్ లింకేజి అయిన విద్యార్థులు/ తల్లి దండ్రుల అకౌంట్ లో మరో 20 రోజుల్లో జమ అవుతుందని వెల్లడించారు. “ఆ కేటగిరీలోని విద్యార్థులకు తమ వాటా నిధులు రూ.382.66 కోట్లు జమ చేసింది. ఈ కారణంగా 9, 10 తరగతులు చదివే ఎస్సీ డే-స్కాలర్ విద్యార్థులకు సంబంధించి వారి తల్లి బ్యాంకు ఖాతాకు రూ.10,900, హాస్టల్ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాకు రూ.8,800/- చొప్పున జమ చేశాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు రూ.5,200/- నుంచి రూ.10,972/- వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.” అని ప్రకటనలో పేర్కొన్నారు.
Andhra Pradesh news
Talli Ki Vandanam
SC Students Welfare
DBT Scheme AP
తల్లి ఖాతాల్లో నగదు జమ
రూ.382.66 కోట్లు నిధులు
Scroll for the next article