News26th Apr 02:00 PMSunil Byrisetty1 min read

పాకిస్తాన్ కోసం చూస్తే.. బంగ్లాదేశీయులు బయటపడ్డారు!

పాకిస్తాన్ జాతీయుల కోసం వెతికితే.. బంగ్లాదేశీయులు బయటపడిన ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం దేశంలోని పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదే

పాకిస్తాన్ కోసం చూస్తే.. బంగ్లాదేశీయులు బయటపడ్డారు!
పాకిస్తాన్ జాతీయుల కోసం వెతికితే.. బంగ్లాదేశీయులు బయటపడిన ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం దేశంలోని పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల హోమ్ శాఖలకు.. అక్రమంగా భారత్‌లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి.. వెనక్కి పంపించాలని ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో విదేశీ వలసదారులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. పాకిస్తాన్ పౌరుల కోసం నిర్వహించిన ఈ ఆపరేషన్ సమయంలో, 400 మందికి పైగా అనుమానాస్పద వలసదారులు బయటపడ్డారు. వీరంతా.. రాష్ట్రంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత పౌరులుగా కొనసాగేందుకు ప్రయత్నించారు. వారిలో అత్యధికంగా బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మిగిలిన వారి వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Ahmedabad
400 bangladeshis
suspicious immigrants
Gujarat Police
బంగ్లాదేశీయులు బయటపడిన ఘటన గుజరాత్‌
విదేశీ వలసదారులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్
Scroll for the next article