News21st May 03:00 PMSunil Byrisetty1 min read
8 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ. 400 కోట్లు
గుడివాడలో రైల్వే గేట్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి.. 400 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలు, స్థానిక సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని న
గుడివాడలో రైల్వే గేట్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి.. 400 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు.
భవిష్యత్తు అవసరాలు, స్థానిక సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలోని 8 గేట్ల వద్ద ఆర్.ఓ.బి మరియు ఆర్.యు.బిల నిర్మాణ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రైల్వే గతి శక్తి పథకంలో భాగంగా మంజూరైన 400 కోట్ల నిధులతో చేపట్టనున్న నిర్మాణాలపై రైల్వే, నేషనల్ హైవే, రెవెన్యూ, మోర్తు శాఖల అధికారులతో.. గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్డీవో బాలసుబ్రమణ్యం సమావేశం అయ్యారు.
సమావేశంలో రైల్వే గేట్ల వద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, తదితర ఇబ్బందులను రెవెన్యూ, ఎన్.హెచ్.ఐ అధికారులు గూగుల్ మ్యాప్ ద్వారా వివరించారు.
గేట్ల వద్ద ఆర్ఓబి, అండర్ బిడ్జిల నిర్మాణాలకు ఉన్న అనుకూలతలను రైల్వే శాఖ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాసరావు తెలిపారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి డీపీఆర్, రైల్వేలోని వివిధ శాఖల అధికారుల ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలన తదితర అంశాలను ఎమ్మెల్యే రాము అధికారులకు వివరించారు.