News29th Oct 12:25 PMSunil Byrisetty1 min read

చదివింది టెన్త్ క్లాస్, ట్రేడింగ్ పేరుతో రూ.400 కోట్లు వసూళ్లు

అతడు ‘‘చదివింది పదో తరగతే. కానీ ట్రేడింగ్‌ పేరుతో సొంతంగా కంపెనీలు పెట్టాడు. డిపాజిటర్లను రూ.వందల కోట్లలో మోసం చేశాడు. పెట్టుబడి పెట్టే వారిని, ఏజెంట్లను నమ్మించేందుకు విదేశీ ట్రిప

చదివింది టెన్త్ క్లాస్, ట్రేడింగ్ పేరుతో రూ.400 కోట్లు వసూళ్లు
అతడు ‘‘చదివింది పదో తరగతే. కానీ ట్రేడింగ్‌ పేరుతో సొంతంగా కంపెనీలు పెట్టాడు. డిపాజిటర్లను రూ.వందల కోట్లలో మోసం చేశాడు. పెట్టుబడి పెట్టే వారిని, ఏజెంట్లను నమ్మించేందుకు విదేశీ ట్రిప్పులు, ఫైవ్ స్టార్ హోటల్‌లో స్టే చేస్తూ, భారీగా ఫంక్షన్లు చేశాడు. వెరసి రూ.400 కోట్లు డిపాజిట్లు వసూలు చేశాడు. విలాస జీవితం గాడి తప్పడంతో చేసేది ఏమి లేక డబ్బులు సర్దుబాటు చేయలేక చేతులెత్తేశాడు.’’ విజయవాడ కేంద్రంగా నాలుగు నెలల క్రితం తేలిన అద్విక ట్రేడింగ్‌ మోసం కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చింది. సోమవారం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏజెంట్ల నివాసాల్లో సోదాలు చేశాయి. సంస్థ యజమాని ఆదిత్య, అతని భార్య సుజాత, మరో 8 మంది ఏజెంట్ల అరెస్టు వివరాలను ఒకటి, రెండు రోజుల్లో వెల్లడించనున్నారు.’’ ఏలూరు జిల్లాకు చెందిన ఆదిత్య హైదరాబాద్‌లో స్థిర పడ్డాడు.
India News
Adhvik Trading Scam
Vijayawada
Andhra Pradesh
Hyderabad
Investment Fraud
Aditya
Financial Scam
Fake Trading Company
పోలీసు దర్యాప్తు
ఏజెంట్ల అరెస్టు
పాంజీ స్కీమ్
ఫైనాన్షియల్ స్కాం
Scroll for the next article