News24th Aug 05:05 PMSunil Byrisetty1 min read
బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 42,456 కోట్లు
రాష్ట్రంలో బీసీలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేసి, వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడల
రాష్ట్రంలో బీసీలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేసి, వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని ఆటోనగర్లో శ్రీ కృష్ణ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ హాల్లో జరిగిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, యాత, శ్రీశయనల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ కలయిక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలకు కూటమి ప్రభుత్వం అందలం వేసిందని, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని నిధులు కేటాయించి బీసీల అభ్యున్నతికి కృషి చేసామన్నారు. బీసీల సంక్షేమానికి కృషి చేస్తూ రాష్ట్ర బడ్జెట్లో రూ.42,456 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వం కేవలం 39,700 కోట్లు మాత్రమే కేటాయించిందని, కూటమి ప్రభుత్వం అదనంగా 21% శాతం నిధులు పెంచి, బీసీల పక్షపాతి అని నిరూపించు కున్నామన్నారు. సీఎం చంద్రబాబు కీలకమైన పదవులు బీసీలకు కేటాయించి బీసీ వర్గాలకు సముచిత స్థానం ఇచ్చారన్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారమన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేసామన్నారు.