News13th May 09:41 AMSunil Byrisetty1 min read

విద్యార్థులకు అండగా ప్రభుత్వం

భారత్- పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యనభ్యసిస్తున్న ఆంధ్రా విద్యార్థ

విద్యార్థులకు అండగా ప్రభుత్వం
భారత్- పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యనభ్యసిస్తున్న ఆంధ్రా విద్యార్థులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేసింది. స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్, రాజ‌స్థాన్, గుజ‌రాత్‌లో చ‌దువుతున్న ఏపీ తెలంగాణ విద్యార్థులు ఆ రాష్ట్రాల‌ని వీడుతున్నారు. ఇప్పటికే మొత్తం 441 మంది విద్యార్థులను ఆయా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సురక్షితంగా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టింది. వీరిలో 158 మంది విద్యార్థులు ఆంధ్రాలోని తమ స్వస్థలాలకు చేరుకునేలా సహకారం అందించింది. ఏపీ భ‌వ‌న్‌లో ఉన్న విద్యార్థుల‌కు వసతి, ఆహారం, స్థానిక రవాణా, ఇతర అన్ని సౌక‌ర్యాల‌ను ఏపీ స‌ర్కార్ ఉచితంగా క‌ల్పిస్తోంది. అలాగే రైలు టికెట్ల కన్ఫర్మేన్‌లోనూ సహాయం చేస్తోంది. వీరంతా ఆంధ్రాలోని స్వగ్రామాలకు చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేస్తోంది.
AP Govt
Operation Sindoor
AP Bhavan
Telugu Students Reaching Delhi
రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సురక్షితంగా చర్యలు
సరిహద్దు రాష్ట్రాల్లో చ‌దువుతున్న ఏపీ తెలంగాణ విద్యార్థులు ఆ రాష్ట్రాల‌ని వీడుతున్నారు
Scroll for the next article