Politics31st Jul 03:40 PMSunil Byrisetty1 min read
ఏపీలో 45 లక్షల ఓట్లు డిలిట్!
రాష్ట్రంలో దాదాపు 45 లక్షల ఓట్లు డిలిటయ్యాయి. మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఎన్నికల సంఘం అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్ల
రాష్ట్రంలో దాదాపు 45 లక్షల ఓట్లు డిలిటయ్యాయి. మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఎన్నికల సంఘం అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాను ఆయన విడుదల చేశారు. ఈ ముసాయిదా జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నెట్ యాప్, సీఈవో వెబ్‌సైట్‌లలో పరిశీలించ వచ్చని సూచించారు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్ల ఉన్నారని.. వారిలో 89.22% మంది ఫారాలు సమర్పించారని తెలిపారు. మొత్తం 15.22 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించామని వివరించారు. 22.30 లక్షల మంది శాశ్వతంగా చిరునామా మారినట్లు లేదా గైర్హాజరైనట్లు కనుగొన్నామని చెప్పారు. 7.37 లక్షల మంది ఓటర్ల పేర్లు రెండు, మూడు చోట్ల నమోదయ్యాయని పేర్కొన్నారు.