News12th Jul 10:30 AMSunil Byrisetty1 min read

కంపించిన విశాఖ!

విశాఖలో పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున సుమారు 5 గంటలకు భూమి కంపించింది. నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, లాసన్స్ బే కోలని, పెదవాల్తేరు, ఈస్

కంపించిన విశాఖ!
విశాఖలో పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున సుమారు 5 గంటలకు భూమి కంపించింది. నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, లాసన్స్ బే కోలని, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్‌బీ కాలనీతో పాటు.. పలు ప్రాంతాల్లో కూడా కంపించినట్లు గుర్తించారు. భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. 5:05:46 గంటలకు భూ ప్రకంపనలు సంభవించినట్టు అధికారికంగా నిర్ధారించారు. ఉదయం పూట అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రజలను కొంత ఆందోళనకు గురిచేసింది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైనా ఇలాంటి స్వల్ప ప్రకంపనలు వచ్చినప్పుడు, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నుంచి రిక్టర్ స్కేల్ తీవ్రత, భూకంప కేంద్రం (Epicenter) గురించిన అధికారిక వివరాలు విడుదలవుతాయి.
Andhra Pradesh
Visakhapatnam
Vizag
Earthquake
Earth Tremors
Seismic Activity
National Centre for Seismology
ఎన్‌సీఎస్
రిక్టర్ స్కేల్
ఎపిసెంటర్
విపత్తు హెచ్చరి
Scroll for the next article