International8th Apr 11:54 AMSunil Byrisetty1 min read

5 విమానాల నిండా ఐఫోన్లు.. అమెరికాకు ఏమైంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ కంపెనీ వేగంగా స్పందించింది. భారత్, చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాల్లో అమెరికాకు చ

5 విమానాల నిండా ఐఫోన్లు.. అమెరికాకు ఏమైంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ కంపెనీ వేగంగా స్పందించింది. భారత్, చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాల్లో అమెరికాకు చేరవేసింది. మూడు రోజుల వ్యవధిలో 5 విమానాలలో ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. భారత్ నుంచి మూడు విమానాలు, చైనా నుంచి రెండు విమానాలు నిండా ఐఫోన్లతో అమెరికా చేరుకున్నాయని వివరించారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయన్న ప్రకటన నేపథ్యంలో మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను పోటును తగ్గించుకోవడానికి భారత్, చైనాలలోని తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లు అన్నింటినీ వెంటనే అమెరికాకు చేరవేసింది. దీనివల్ల ఐఫోన్ల ధరలను మరికొంతకాలం స్థిరంగా ఉంచేందుకు యాపిల్ కంపెనీకి అవకాశం లభించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్‌లు అమలులోకి వచ్చినా ఇప్పటికిప్పుడు ఐఫోన్ల ధరలు పెంచే ఆలోచన యాపిల్ కంపెనీ ప్రకటన విడుదల చేసింది.
Apple iPhones Shipment
US tariffs impact
india exports to US
ఐఫోన్లను ఎగుమతి
ట్రంప్ టారిఫ్‌
Scroll for the next article