Politics30th Dec 12:09 PMSunil Byrisetty1 min read

ఆ తప్పును సరిదిద్దడానికి 50 కోట్లు

గ‌త వైసీపీ హ‌యాంలో రైతుల‌కు ఇచ్చిన ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌పై నాటి సీఎం జ‌గ‌న్ ఫొటోల‌ను ముద్రించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. తర్వాత ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధి

ఆ తప్పును సరిదిద్దడానికి 50 కోట్లు
గ‌త వైసీపీ హ‌యాంలో రైతుల‌కు ఇచ్చిన ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌పై నాటి సీఎం జ‌గ‌న్ ఫొటోల‌ను ముద్రించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. తర్వాత ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాము అధికారంలోకి వ‌స్తే.. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోల‌ను తీసేస్తామ‌ని కూడా చెప్పారు. ఆ స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌ను ముద్రిస్తామ‌న్నారు. దీనిపై కొన్నాళ్లుగా గ్రామ‌స్థాయిలో రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌.. 18 నెల‌ల త‌ర్వాత కూడా ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని మీడియాలోనూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేసింది. దీని ప్ర‌కారం.. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ఇచ్చిన పాసు పుస్త‌కాల‌ను వెన‌క్కి తీసుకుని వాటి స్థానంలో కొత్త‌గా పాసుపుస్త‌కాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. కొత్త పాస్ పుస్త‌కాలు ఇచ్చేందుకు.. సుమారు 50-70 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచనా.
Andhra Pradesh Government
Pattadar Passbooks
YSRCP Government
Jagan Mohan Reddy
TDP
Chandrababu Naidu
రైతులు
ప్రభుత్వ రాజముద్ర
రెవెన్యూ శాఖ
వివాదం
ప్రజా డిమాండ్
Scroll for the next article