News13th Nov 03:38 PMSunil Byrisetty1 min read
లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు
కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచ ఉద్యోగ మార్కెట్లను సమూలంగా మారుస్తున్నాయని, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో రాణించాలంటే యువత నిరంతర అభ్యాసం, సరికొత్త నైపుణ్యాలన
కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచ ఉద్యోగ మార్కెట్లను సమూలంగా మారుస్తున్నాయని, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో రాణించాలంటే యువత నిరంతర అభ్యాసం, సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు శుక్రవారం హాల్-2లో ‘భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు నైపుణ్యాలు – ప్రతిభ, ఏఐ, డిజైన్, డిజిటల్ అభ్యాసం’ అనే అంశంపై ప్లీనరీ సమావేశం నిర్వహించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆస్తిని వారసత్వంగా పొందవచ్చేమో కానీ, నైపుణ్యాన్ని ఎవరూ దోచుకోలేరని, అది అత్యంత ప్రజాస్వామ్యబద్ధమైన సంపద అని అభివర్ణించారు. రాష్ట్రంలోని 25 లక్షల ఎంఎస్ఎంఈలలో 11 లక్షల సంస్థలు మహిళలవేనని పేర్కొన్నారు. సీఐఐ సహకారంతో లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దేందుకు 50 డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు ‘స్వయం ఏపీ’ పేరుతో ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు.